ఏడు గుర్రాల రథంపై... KATRINA వద్దకి VICKY KAUSHAL...

ABN , First Publish Date - 2021-12-06T22:29:40+05:30 IST

‘మల్లీశ్వరి’ మనువుకి ముహూర్తం దగ్గర పడుతోన్న కొద్దీ ముంబైలో కోలాహలం మరింతగా పెరుగుతోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకున్నా పుకార్లు మాత్రం బోలెడన్ని షికార్లు కొడుతున్నాయి. తాజా ప్రచారం ఏంటంటే... రాజస్థాన్‌లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో జరుగుతోన్న వివాహ వేడుకలో వరుడు విక్కీ కౌశల్ ఎంట్రీ కూడా రాజసం ఉట్టిపడేలానే ఉంటుందట!

ఏడు గుర్రాల రథంపై... KATRINA వద్దకి VICKY KAUSHAL...

‘మల్లీశ్వరి’ మనువుకి ముహూర్తం దగ్గర పడుతోన్న కొద్దీ ముంబైలో కోలాహలం మరింతగా పెరుగుతోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకున్నా పుకార్లు మాత్రం బోలెడన్ని షికార్లు కొడుతున్నాయి. తాజా ప్రచారం ఏంటంటే... రాజస్థాన్‌లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో జరుగుతోన్న వివాహ వేడుకలో వరుడు విక్కీ కౌశల్ ఎంట్రీ కూడా రాజసం ఉట్టిపడేలానే ఉంటుందట!


రాజస్థాన్‌ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్‌లో ఉన్న ‘సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్‌’లో డిసెంబర్ 9న జరుగనుంది బిగ్ బాలీవుడ్ వెడ్డింగ్. వందల ఏళ్ల కిందటి రాజ్‌పుత్ రాజుల కోటలో కత్రీనా, విక్కీ కౌశల్ జంటగా ఏడు అడుగులు వేయనున్నారు. అయితే సెవన్ శాక్రెడ్ స్టెప్స్ కంటే ముందు వరుడు విక్కీ కౌశల్ ఎంట్రీకి కూడా సెవన్ నెంబర్‌నే ఎంచుకున్నారు ఆర్గనైజర్స్! బాలీవుడ్ అందగాడు తన కాబోయే భార్య కోసం ఏడు గుర్రాలు పూన్చిన రథంపై తరలి వస్తాడట! 


కత్రీనా మెడలో మూడు ముళ్లు వేయాల్సిన కళ్యాణ మండపం వద్దకి విక్కీ కౌశల్ వచ్చేందుకు ఇప్పటికే నిర్వాహకులు ఏడు తెల్లటి గుర్రాల్ని ఎంపిక చేసి పెట్టారట. అవి రాజసం ఉట్టిపడే అందమైన రథాన్ని లాగుతుంటే పెళ్లి కొడుకుగా విక్కీ కౌశల్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ప్రత్యేక ఆహ్వానం మీద వేడుకకి తరలి వచ్చిన 120 మంది అతిథుల సమక్షంలో వివాహ తంతు జరగబోతోంది. పెళ్లి డిసెంబర్ 9న అయినప్పటికీ 7వ తేదీ నుంచే పెళ్లిసందడి నెలకొననుంది. సంగీత్, మెహందీ ఫంక్షన్ల తరువాత వెడ్డింగ్, ఆ తరువాత రిసిప్షన్ జరుగుతాయని బాలీవుడ్ సమాచారం. కత్రీనా, విక్కీ కౌశల్ ముంబైకి తిరిగి వచ్చాక పరిశ్రమలోని మిగతా మిత్రులు, శ్రేయోభిలాషులకి ఇంకొక భారీ రిసిప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు... 

Updated Date - 2021-12-06T22:29:40+05:30 IST