పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన ఫేమస్ సింగర్

ABN , First Publish Date - 2022-01-26T21:17:54+05:30 IST

భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ప్రముఖ సింగర్ తిరస్కరించారు. ఆ అవార్డు తనకొద్దంటూ బుధవారం తెలిపారు.

పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన ఫేమస్ సింగర్

భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ప్రముఖ సింగర్ తిరస్కరించారు. ఆ అవార్డు తనకొద్దంటూ బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు తనకొద్దని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సింగర్ సంధ్య ముఖర్జీ తెలిపారు. తన స్థాయికి ఈ అవార్డు తగదని పేర్కొన్నారు. ఈ అవార్డు జూనియర్ ఆర్టిస్టులకు అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా.. పశ్చిమ బెంగాల్ నుంచి పద్మ అవార్డులను తిరస్కరించిన రెండో వ్యక్తి ఆమె. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేబ్ బట్టాచార్య కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించారు. 


సంధ్య ముఖర్జీ పద్మ అవార్డును తిరస్కరించడంతో ఆమె కూతురు సౌమీ సేన్‌‌గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ నుంచి మా అమ్మకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ వయసులో ఆ అవార్డు ఇవ్వడం అవమానకరమని తేల్చి చెప్పింది’ అని సౌమీ సేన్ గుప్తా మీడియాకు తెలిపారు. గతంలో అనేక మంది వ్యక్తులు పద్మ అవార్డులను వద్దని చెప్పారు. ఫిల్మ్ రైటర్ సలీమ్ ఖాన్ 2015లో పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. చరిత్రకారిణి రొమిల్లా థాపర్ కూడా 2005లో పద్మ భూషణ్ అవార్డును నిరాకరించారు. పలు భాషల్లో వేలాది పాటలను పాడిన ఎస్. జానకి పద్మ భూషణ్ అవార్డును 2013లో తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-01-26T21:17:54+05:30 IST