మరోసారి వెన్నెల కిషోర్ డైరెక్షన్..!
ABN , First Publish Date - 2021-07-18T15:48:49+05:30 IST
మరోసారి ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్షన్ చేయబోతున్నాడని తాజా సమాచారం. గతంలో ఈయన 'వెన్నెల వన్ బై టు'కి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో గ్యాప్ తీసుకున్న వెన్నల కిశోర్, మళ్ళీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నారట.

మరోసారి ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్షన్ చేయబోతున్నాడని తాజా సమాచారం. గతంలో ఈయన 'వెన్నెల వన్ బై టు'కి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో గ్యాప్ తీసుకున్న వెన్నల కిశోర్, మళ్ళీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నారట. అయితే ఈ సారి మూవీ కాకుండా వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అల్లు అరవింద్ యంగ్ టాలెంట్‌ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వీరితో పాటు ఆల్రెడీ ఇంతకముందు డైరెక్షన్ చేసిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్‌కి ఓ వెబ్ సిరీస్ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించినట్టు సమాచారం. ఇందులో ఆయన కీలకపాత్ర కూడా పోషించనున్నాడట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయట.