టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్ 3 ఇటీవల షూటింగ్ పూర్తై శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. మరోవైపు ప్రమోషన్లోను చిత్రబృందం బిజీగా ఉది. ఇక వెంకీ తన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు కోసం కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తదుపరి చిత్రానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతోంది. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం అనుదీప్ చెప్పిన కథను వెంకీ ఓకే చేశాడట. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ద్విభాషా చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కంప్లీట్ కాగానే వెంకటేష్‌తో చేసే చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని సమాచారం.