వెంకీకి రేచీకటి.. వరుణ్‌కు నత్తి

టాలీవుడ్‌లో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అజేయ దర్శకుడు అనిపించుకున్నది అనిల్ రావిపూడి. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ ఆయన కేవలం కామెడీ ఎంటర్ టైనర్స్ తోనే ట్రావెల్ అవుతున్నారు. యాక్షన్ హీరోలతో కూడా అదిరిపోయే రేంజ్ లో కామెడీ పలికించగలిగే ఆయన ప్రస్తుతం రూపొందిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఎఫ్3’. ఇంతకు ముందు సూపర్ హిట్ అయిన ‘ఎఫ్2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రలతో వేరే కథతో రెండో భాగం ‘ఎఫ్ 3’ రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఇందులో కూడా తోడల్లుళ్ళు గానూ, వారి భార్యలుగా వరుసగా తమన్నా, మెహ్రీన్‌లే నటిస్తున్నారు. అయితే ఇందులో సునీల్ పాత్ర కూడా యాడ్ అవుతోంది. అలాగే మరికొందరు నటీనటులు ఇందులో తమదైన శైలిలో కామెడీ పండించబోతున్నారు.


ఇక ఈ సినిమాలోని అతి ముఖ్యమైన విశేషమేంటంటే.. ఇందులో వెంకీకి రేచీకటి, వరుణ్‌కి నత్తి ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడే స్వయంగా చెప్పారు. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో వారి బలహీనతలు వెండితెరపై నవ్వులు పూయిస్తాయని చెబుతున్నారు అనిల్. అంతే కాదు ఈ సినిమా తర్వాత కూడా ఈ ఫ్రాంచెయిజీ కొనసాగుతుందని, అలాగే తెలుగు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేయాలని ఉందని చెబుతున్నారు అనిల్ రావిపూడి. మరి వెంకీ రేచీకటి, వరుణ్ నత్తి ఎఫ్ 3 చిత్రానికి ఏ రేంజ్ లో హైలైట్స్ అవుతాయో చూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.