కరోనా టైమ్‌లో మిగతా హీరోలకు భిన్నంగా మంచి స్పీడ్ చూపించారు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). ‘నారప్ప (Narappa), దృశ్యం 2 (Drishyam 2)’ చిత్రాల్ని చకచకా పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేసి వరుస హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (F3) చిత్రాన్ని థియేటర్స్‌లో వదిలి దాంతో కూడా సూపర్ హిట్ సాధించారు. రీసెంట్గా అన్న కొడుకు రానాతో కలిసి ‘రానానాయుడు’ (Rananaidu) వెబ్ సిరీస్‌ను మాత్రం కంప్లీట్ చేశారు. త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో ఆ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వెంకీ చేతిలో ఎలాంటి చిత్రాలు లేవు. తదుపరి చిత్రం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. అభిమానుల్ని నిరాశ పరుస్తున్నారు.
నిజానికి తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో వెంకీ ఈ పాటికి ఒక సినిమాను మొదలు పెట్టాలి. వారిద్దరి మధ్య కథా చర్చలు ఒక కొలిక్కిరాక చిత్రం వర్కవుట్ కాలేదు. మరో వైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) హిందీ చిత్రం ‘కభీ ఈద్ కభీ దీవాలి (Kabhi Eed Kbahi Deewali)’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు వెంకీ. దీని షెడ్యూల్ మొదలు కావడానికి ఇంకా టైముంది. ఇప్పుడు వెంకీ ఖాళీనే. అయితే త్వరలో వెంకటేశ్ కొత్త సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ‘జాతి రత్నాలు’ (Jathiratnalu) ఫేమ్ అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో వెంకీ ఒక సినిమా చేయబోతున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైందని వినికిడి.
ప్రస్తుతం అనుదీప్ .. తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan) తో ‘ప్రిన్స్’ (Prinice) అనే మూవీ తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. దీపావళికి చిత్రం విడుదల కాబోతోంది. అది రిలీజవగానే వెంకీతో అనుదీప్ చిత్రం మొదలవుతుందట. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. కామెడీ టైమింగ్ తో తిరుగులేని వెంకీ, న్యూజెన్ కామెడీ చిత్రాలు తీయడంలో చెయితిరిగిన అనుదీప్ కలయికలో ఏ తరహా చిత్రం రాబోతోందని ఆసక్తి మొదలైంది. వెంకీలోని కామెడీ టాలెంట్‌ను ఈ సినిమాతో అనుదీప్ ఓ రేంజ్ లో వినియోగించుకోనున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందట. మరి వెంకీతో అనుదీప్ ఏ తరహా చిత్రం తీస్తాడో చూడాలి.