‘మహర్షి’ సినిమాను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘మహర్షి’.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా.. ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు ను సైతం కైవసం చేసుకుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ను అందుకున్నారు దర్శకుడు వంశీ. ఈ సందర్భంగా  వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా ‘మహర్షి’ సినిమాను వీక్షించి సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపి.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  అలాగే.. మహేశ్ బాబు సైతం ఉపరాష్ట్రపతికి  ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  



అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.