ఒరిజినల్ కన్నా బెటర్‌గా ‘దృశ్యం2’ స్ర్కిప్ట్ రాశారు జీతూ జోసెఫ్ : వెంకటేశ్
ABN , First Publish Date - 2021-11-18T22:35:16+05:30 IST
విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’ కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేష్ గురువారం మీడియాతో ముచ్చటించారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు.

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’ కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేష్ గురువారం మీడియాతో ముచ్చటించారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు ముఖ్య ఉద్దేశం. అలాంటి అద్భుతమైన పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూజోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచును కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా ‘దృశ్యం 2’ అర్థమవుతుంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది’ అని తెలిపారు.
‘అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తాను. దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎవరూ మారడం లేదు. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో జనాలు మాకేం వద్దు అన్నారు. ఇప్పుడంతా మళ్లీ మొదటికి వచ్చింది. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి’... అంటూ వెంకీ ‘దృశ్యం 2’ గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాల్ని తెలియచేశారు.