Venkatesh - Raviteja మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

Twitter IconWatsapp IconFacebook Icon
Venkatesh - Raviteja మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్‌తో పాటు ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనూ మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల సినిమాల తర్వాత మన స్టార్స్ కలిసి నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి సిరీస్ (Bahubali), ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి పాన్ ఇండియా రేంజ్ మల్టీస్టారర్స్‌తో పాటుగా ఆచార్య (Acharya) లాంటి పక్కా కమర్షియల్ చిత్రాలూ వస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్‌పైన కూడా కొన్ని మల్టీస్టారర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లూ ఉన్నాయి.  

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, మెగా 154 లోనూ మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న హిందీ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ Sai Dharamtej) కలిసి తమిళ హిట్ సినిమా వినోదాయ సితం తెలుగు రీమేక్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు మరికొన్ని కూడా మొదలవబోతున్నాయి.

అయితే, తాజా సమాచారం మేరకు విక్టరీ వెంకటేశ్, మాస్ మహారాజ రవితేజ కలిసి నటించబోతున్నారట. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు తీసి మంచి క్రేజీ డైరెక్టర్‌గా మారారు శ్రీకాంత్ అడ్డాల. గత చిత్రం నారప్పతోనూ వెంకీకి మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నారట. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే, శ్రీకాంత్ అడ్డాల వెంకీకి లైన్ చెప్పగా..ఆయనకు నచ్చి ఒకే చెప్పారట. ఇక మరో హీరో రవితేజకు కథ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. మాస్ మహారాజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక వెంకీ - రవితేజల మల్టీస్టారర్ లైన్‌లోకి వస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.