వెంకట్‌ ప్రభు సినిమా టైటిల్‌కు చిక్కులు

ABN , First Publish Date - 2022-01-23T03:44:16+05:30 IST

‘మానాడు’ చిత్రం విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న దర్శకుడు వెంకట్‌ ప్రభు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది ఆయన పదో చిత్రం. దీనికి ‘మన్మథ లీలై’ అనే టైటిల్‌ పెట్టారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మించే ఈ చిత్రంలో అశోక్‌ సెల్వన్‌, సంయుక్తా హెగ్డే

వెంకట్‌ ప్రభు సినిమా టైటిల్‌కు చిక్కులు

‘మానాడు’ చిత్రం విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న దర్శకుడు వెంకట్‌ ప్రభు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది ఆయన పదో చిత్రం. దీనికి ‘మన్మథ లీలై’ అనే టైటిల్‌ పెట్టారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మించే ఈ చిత్రంలో అశోక్‌ సెల్వన్‌, సంయుక్తా హెగ్డే, స్మృతి వెంకట్‌ తదితరులు నటించనున్నారు. అయితే, ఈ చిత్రానికి టైటిల్‌ చిక్కులు ఉత్పన్నమయ్యాయి.


గతంలో కమల్‌ హాసన్‌ హీరోగా ఇదే పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీన్ని కళాకేంద్ర అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే, ఈ సంస్థను మాటమాత్రం కూడా సంప్రదించకుండా వెంకట్‌ ప్రభు తన కొత్త చిత్రానికి ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దీనిపై కళాకేంద్ర సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ అంశంపై వెంకట్‌ ప్రభు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది. 

Updated Date - 2022-01-23T03:44:16+05:30 IST