కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అవుతోన్న పవన్ కల్యాణ్ చెల్లెలు

ABN , First Publish Date - 2022-01-25T03:58:09+05:30 IST

ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లకు మంచి ప్రేక్షకాధారణ రావడంతో ఇపుడు మూడో సీజన్‌ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు రాంజీ మళ్ళీ మిస్టర్‌ రమణిగాను, నటి వాసుకి ఆనంద్‌..

కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అవుతోన్న పవన్ కల్యాణ్ చెల్లెలు

గతంలో తమిళ బుల్లితెరపై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘రమణి వర్సెస్‌ రమణి’ సీజన్‌ ఇపుడు సరికొత్తగా, మరింత హైటెక్‌ పరిఙ్ఞానంతో ‘రమణి వర్సెస్‌ రమణి 3.0’గా ప్రేక్షకుల ముందుకురానుంది. కొన్నేళ్ళ కిత్రం వచ్చిన ఈ బుల్లితెర సీరియల్‌ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇపుడు సరికొత్తగా టీవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఫ్యామిలీ డ్రామా కోణంలో రూపొందించారు. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లకు మంచి ప్రేక్షకాధారణ రావడంతో ఇపుడు మూడో సీజన్‌ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు రాంజీ మళ్ళీ మిస్టర్‌ రమణిగాను, నటి వాసుకి ఆనంద్‌ (‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించారు) మిస్సెస్‌ రమణి పాత్రలను పోషిస్తున్నారు. వీరికుమార్తె రాగిణిగా పొన్ని సురేష్‌, కుమారుడు రామ్‌ పాత్రలో గుహనేష్‌ నటించారు. 


ఈ కొత్త సీజన్‌ గురించి దర్శకుడు నాగా వివరిస్తూ.. కుటుంబ జీవితం అంటేనే కష్టనష్టాలు, సుఖదుఃఖాలు, సంతోషం, విషాదం, ఎత్తుపల్లాలతో ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఇవి ఉంటాయి. అయితే, ప్రాశ్యాత్య దేశాలతో పోల్చినపుడు భారతదేశ సంస్కృతీ సంప్రదాయలు భిన్నంగా ఉంటాయి. మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనిపించకుండా పోతుంది. ముఖ్యంగా వివిధ కారణాల రీత్యా వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరి మనసుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతర్లీనంగా బలంగా నాటుకుని ఉంది. ఇలా నివసించే ప్రతి ఒక్కరి జీవితాల్లో చోటుచేసుకునే వివిధ సంఘటలతో ఆసక్తికరంగా కడుపుబ్బ నవ్వించేలా ‘రమణి వర్సెస్‌ రమణి 3.0’ తెరకెక్కించాము. రాంజీ, వాసుకి ఆనంద్, ఇంకా ఇతర పాత్రలన్నీ ప్రేక్షకులని చక్కగా ఎంటర్‌టైన్ చేస్తాయని తెలిపారు.

Updated Date - 2022-01-25T03:58:09+05:30 IST