F3 : 2000 నోటుతో వరుణ్ తేజ్ హంగామా

ABN , First Publish Date - 2022-01-19T19:26:39+05:30 IST

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రలతో వేరే కథతో ఈ సినిమా రూపొందుతోంది. వెంకీ, వరుణ్ ఇందులో తోడల్లుళ్ళుగానే కంటిన్యూ అవుతున్నారు. అలాగే. వారి భార్యలుగా తమన్నా, మెహరీనే నటిస్తున్నారు. అదనంగా ఇందులోకి సునీల్ పాత్ర వచ్చి చేరింది. డబ్బు కారణంగా తమ భార్యలతో తోడల్లుళ్ళి్ద్దరికీ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే చిత్ర కథాంశం. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. వరుణ్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

F3 : 2000 నోటుతో వరుణ్ తేజ్ హంగామా

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రలతో వేరే కథతో ఈ సినిమా రూపొందుతోంది. వెంకీ, వరుణ్ ఇందులో తోడల్లుళ్ళుగానే కంటిన్యూ అవుతున్నారు. అలాగే. వారి భార్యలుగా తమన్నా, మెహరీనే నటిస్తున్నారు. అదనంగా ఇందులోకి సునీల్ పాత్ర వచ్చి చేరింది. డబ్బు కారణంగా తమ భార్యలతో తోడల్లుళ్ళిద్దరికీ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే చిత్ర కథాంశం. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. వరుణ్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.


2000నోటు చేత్తోపట్టుకొని వరుణ్ డ్యాన్స్ చేస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఏప్రిల్ 28న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 29 అని ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు 28కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం విశేషం.  దిల్‌రాజ్ ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకుంటోన్న ‘ఎఫ్ 3’ చిత్రం మొదటి భాగాన్ని మంచి నవ్విస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘సమ్మర్ సోగ్గాళ్ళు’ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి. 



Updated Date - 2022-01-19T19:26:39+05:30 IST