నిహారిక సక్సెస్‌ కొట్టాలి -వరుణ్‌ తేజ్‌

ABN , First Publish Date - 2021-11-13T04:55:44+05:30 IST

‘‘ఏడాది క్రితం వెబ్‌సిరీస్‌ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. ప్రయోగాలు చేస్తూ తన దారిని వెతుక్కోవాలనుకుంటుంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్‌ చాలా బావుంది. మీ అందరికీ ఈ వెబ్‌సిరీస్‌ నచ్చుతుందని ఆశిస్తున్నాను....

నిహారిక సక్సెస్‌ కొట్టాలి -వరుణ్‌ తేజ్‌

‘‘ఏడాది క్రితం వెబ్‌సిరీస్‌ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. ప్రయోగాలు చేస్తూ తన దారిని వెతుక్కోవాలనుకుంటుంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ట్రైలర్‌ చాలా బావుంది. మీ అందరికీ ఈ వెబ్‌సిరీస్‌ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సంగీత్‌ శోభన్‌ అనుభవం ఉన్న నటుడిలా చేశాడు’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు. నిహారికా కొణిదెల నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ ఈ నెల 19న జీ5 ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘మేం ఎప్పుడూ నిహారికకు ఏం చేయాలో చెప్పలేదు. తన  కష్టం ఫలించి ఈ సిరీస్‌తో విజయాన్ని అందుకోవాలి’’ అని కోరుకున్నారు.  ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ‘‘ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. సిమ్రాన్‌ శర్మ చాలా కష్టపడ్డారు. వీకే నరేష్‌ గారు ఇప్పటిదాకా వెబ్‌సిరీస్‌లో నటించలేదు. నేనడిగాను అని ఒప్పుకున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2021-11-13T04:55:44+05:30 IST