డాక్టర్‌... ఎందుకీ కిడ్నాప్‌లు?

ABN , First Publish Date - 2021-09-28T05:11:22+05:30 IST

రోగులకు చికిత్స అందించాల్సిన ఓ డాక్టర్‌ కొంతమందితో కలిసి ఓ కుటుంబంలా ఏర్పడి ఎందుకు కిడ్నా్‌పలు చేస్తున్నాడు? హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ (అమ్మాయిల అక్రమ రవాణా)కు, డాక్టర్‌ చేసే కిడ్నా్‌పలకు సంబంధం ఏమిటి?...

డాక్టర్‌... ఎందుకీ కిడ్నాప్‌లు?

రోగులకు చికిత్స అందించాల్సిన ఓ డాక్టర్‌ కొంతమందితో కలిసి ఓ కుటుంబంలా ఏర్పడి ఎందుకు కిడ్నా్‌పలు చేస్తున్నాడు? హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ (అమ్మాయిల అక్రమ రవాణా)కు, డాక్టర్‌ చేసే కిడ్నా్‌పలకు సంబంధం ఏమిటి? డాక్టర్‌ ఎందుకు గన్‌ పట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. శివ కార్తికేయన్‌, ప్రియాంకా అరుల్‌ మోహన్‌ జంటగా నటించారు. నెల్సన్‌ దిలీ్‌పకుమార్‌ దర్శకత్వం వహించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో ‘డాక్టర్‌’ విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌ విడుదల చేశారు. నిర్మాత కోటపాడి జె. రాజేశ్‌ మాట్లాడుతూ ‘‘ఉత్కంఠభరిత మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ట్రైలర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. అనిరుధ్‌ సంగీతం అందించిన పాటల్ని త్వరలో విడుదల చేస్తాం. ‘శక్తి’ తర్వాత శివ కార్తికేయన్‌తో మేం చేసిన చిత్రమిది’’ అని చెప్పారు. వినయ్‌ రాయ్‌, యోగిబాబు, మిళింద్‌ సోమన్‌ ఇందులో ఇతర తారాగణం.

Updated Date - 2021-09-28T05:11:22+05:30 IST