డ్రైవర్ కోసం... బాలీవుడ్ స్టార్ హీరో...

ABN , First Publish Date - 2022-01-24T04:12:53+05:30 IST

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మనోజ్‌కి నివాళులు అర్పించాడు. అతనెవరు అంటారా? వరుణ్ కారు డ్రైవర్‌గా మనోజ్ పని చేసేవాడు. అయితే, ఈ మధ్యే ఆయన గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు.

డ్రైవర్ కోసం... బాలీవుడ్ స్టార్ హీరో...

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మనోజ్‌కి నివాళులు అర్పించాడు. అతనెవరు అంటారా? వరుణ్ కారు డ్రైవర్‌గా మనోజ్ పని చేసేవాడు. అయితే, ఈ మధ్యే ఆయన గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. 


‘‘మనోజ్ భాయ్, మిస్ యూ సో మచ్’’ అంటూ ధావన్ తన బాధని సొషల్ మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకున్నాడు. అంతే కాదు, బీచ్‌లో హార్ట్ షేప్‌ను ఇసుక మీద గీసి... అందులో ‘‘మనోజ్ భాయ్, నిన్ను మిస్ అవుతున్నాను...’’ అంటూ పెద్ద అక్షరాలతో వరుణ్ రాశాడు. ఆ దృశ్యాన్ని కూడా ఇన్‌స్టాలో స్టోరీ పిక్‌గా షేర్ చేశాడు. 


చాలా రోజులుగా వరుణ్ ధావన్ కారు డ్రైవర్‌గా పని చేస్తోన్న మనోజ్‌తో యంగ్ హీరోకు ఎంతో అనుబంధం ఉండేది. తన డ్రైవర్‌‌తో కలసి గతంలో ఎలాంటి ఇగో ప్రదర్శించకుండా మీడియా కెమెరాలకు వరుణ్ ఫోజిచ్చాడు కూడా. మనోజ్‌కు వరుణ్ అందించిన నివాళి చూస్తే ఆయన వారింట్లో సభ్యుడిగా కలిసిపోయాడని మనం భావించవచ్చు. వరుణ్ ధావన్ అభిమానులు సైతం ఆన్‌లైన్‌లో మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు... 

Updated Date - 2022-01-24T04:12:53+05:30 IST