Kiss: సడెన్‌గా ముద్దు పెట్టిన వరుణ్ ధావన్.. షాకైన కియారా అడ్వాణీ.. ఇలా అయితే కష్టం గురూ అంటూ..

Twitter IconWatsapp IconFacebook Icon
Kiss: సడెన్‌గా ముద్దు పెట్టిన వరుణ్ ధావన్.. షాకైన కియారా అడ్వాణీ.. ఇలా అయితే కష్టం గురూ అంటూ..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో వరుణ్ ధావన్ (Varun Dhawan) ఒకరు. వరుసగా లవ్‌స్టోరీలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర నటుడికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. ఈ నటుడు తాజాగా నటించిన సినిమా ‘జుగ్ జుగ్ జీయో’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.100 కోట్లకి పైగా కలెక్షన్లతో సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీలో ఈయనకి జోడిగా కియారా అడ్వాణీ (Kiara Advani) నటించింది. మూవీలో ఈ నటులిద్దరూ జంటగా బావున్నారని ప్రశంసలు సైతం వచ్చాయి.


తాజాగా కియారా, వరుణ్ కలిసి ఓ మేగజైన్‌కి కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. దానికి సంబంధించిన వీడియోని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan) షేర్ చేశాడు. ఆ వీడియోలో.. కియారా లావెండర్ షిమ్మరీ షర్ట్ డ్రెస్‌లో ఉండగా.. వరుణ్ వైట్ షర్ట్‌లో డాపర్ లుక్‌లో ఉన్నాడు. ఇద్దరూ కౌగిలించుకుని ఫొటోకి స్టిల్స్ ఇస్తున్నారు. ఇంతలో వరుణ్ సడెన్‌గా కియారా బుగ్గగా ముద్దు పెట్టాడు. ఆ అనుకోని పరిణామానికి షాకైన ఆ భామ సాఫ్ట్ వరుణ్ చెంప మీద చేతితో కొట్టింది. ఈ వీడియోకి.. ‘షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోలేకపోతే ఇలాంటివే జరుగుతాయి’ అని కేఆర్‌కే క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు.. ‘ఇలా అయితే కష్టం గురూ’ అంటూ వరుణ్‌ని విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.