Katrina Kaif, విక్కీ కౌశల్ పెళ్లికి రావాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే

ABN , First Publish Date - 2021-12-01T21:44:31+05:30 IST

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో

Katrina Kaif, విక్కీ కౌశల్ పెళ్లికి రావాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో డిసెంబర్ 9న వీరి వివాహం జరగనుందని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి హాజరుకాబోయే వారు తప్పనిసరిగా కొన్ని నియమ, నిబంధనలను పాటించాలని తెలుస్తోంది. అతిథులందరూ నిబంధనలన్నింటిని తప్పనిసరిగా పాటిస్తామంటూ అంగీకారపత్రంపై సంతకం చేయాల్సి ఉందని సమాచారం. 


* పెళ్లికి హాజరుకాబోతున్నామని ఎట్టిపరిస్థితుల్లో బయటికి వెల్లడించకూడదు.

* వివాహానికి సంబంధించిన ఫొటోలు తీయకూడదు.

* సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయకూడదు. 

* లోకేషన్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీలు లేదు. 

* పెళ్లి జరిగే ప్రదేశంలో ఉన్నంత వరకు బయటి ప్రపంచంతో సంబంధాలు కొనసాగించకూడదు. 

* వెడ్డింగ్ ప్లానర్స్ అంగీకారం తెలిపిన తర్వాత మాత్రమే ఫొటోలను  పబ్లిష్ చేయాలి.

* పెళ్లి జరిగే ప్రాంతంలో రీల్స్, వీడియోలు తీయకూడదు. 


రంగూన్, బ్లాక్ మెయిల్, బాదాయి హో వంటి సినిమా‌ల్లో నటించి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు గజరాజ్ రావ్. ఈ నియమ, నిబంధనలతో అసంతృప్తి చెందాడు. సోషల్ మీడియాలో ఒక మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ‘‘ వివాహ వేదికలో మొబైల్ ఫోన్ బ్యానా..? ’’ అనే స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ‘‘ మీ పెళ్లిలో సెల్ఫీని తీసుకొనివ్వలేకపోతే నేను రాలేను ’’ అని ఆ పోస్ట్ కింద కామెంట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలెట్టింది.   

Updated Date - 2021-12-01T21:44:31+05:30 IST