విడుదలకు సిద్ధమైన వెరైటీ తమిళ చిత్రం

Twitter IconWatsapp IconFacebook Icon
విడుదలకు సిద్ధమైన వెరైటీ తమిళ చిత్రం

కవిన్‌ క్రియేటర్స్‌ బ్యానరుపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నెడునీర్‌’ (Neduneer). రాజ్‌క్రిష్‌ (Rajkrish), ఇందుజ (Induja), సత్య మురుగన్‌, మహీరా కనకరాజ్‌, మిన్నల్‌ రాజా తదితర నూతన నటీనటులు నటించిన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూర్చిన కేకే.పద్మనాభన్‌ (KK Padmanabhan) దర్శకత్వం వహించగా, ఆడియోను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘మనకళ్ళ ముందే కనిపించే మానవ సంబంధాలే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ప్రతి వ్యక్తి జీవితంలో రోజుకు 24 గంటలుంటాయి. మనల్ని దాటుకుని వెళ్ళే ప్రతి సాధారణ వ్యక్తి ఈ సినిమాలో కనిపిస్తారు. 


ఒక ప్రేమ, ఒక సంఘటన, ఒక సమస్య.. ఇలా ఏ ఒక్క అంశాన్ని ఈ సినిమాలో ప్రధానాంశంగా చూడకూడదు. ఒక గ్రామంలో చిన్న వయస్సులో విడిపోయిన ఓ జంట కొన్నేళ్ళ తర్వాత ఎదురెదురుగా తారసపడతారు. ప్రాణాలను కాపాడుకునే స్థితిలో ఆమె, ప్రాణం కోల్పోయే స్థితిలో అతడు ఉంటారు. ఆ తర్వాత జరిగే ఆసక్తికర సంఘటనలే ఈ సినిమా స్ర్కీన్‌ప్లే. త్వరలోనే విడుదల చేయనున్నాం’ అని వివరించారు. ఈ సినిమాకు సంగీతం హితేష్‌ మురుగవేల్‌. నిర్మాత ఏవీఎస్‌ పాళెయం (AVS Palayam S Krishnamurthy) ఎస్‌.కృష్ణమూర్తి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.