వారసుడు వచ్చాడు

Twitter IconWatsapp IconFacebook Icon
వారసుడు వచ్చాడు

ఇటీవలె ‘బీస్ట్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు తమిళ హీరో విజయ్‌. ఆయన కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి తెలుగులో ‘వారసుడు’, తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక రోజు ముందే  ఆయన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను వెల్లడించింది. సూట్‌ ధరించి క్లాసీ లుక్‌లో విజయ్‌ ఆకట్టుకున్నారు. ఆయనకి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాష్‌రాజ్‌, ఖుష్బూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.