టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్గా 'హనుమాన్' టైటిల్‌తో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించబోతుందనే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విభిన్నమైన పాత్రలతో తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె, ఈ ఏడాది టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ పాత్రతో తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాలో పోషించిన లాయర్ పాత్రలోనూ అందరినీ ఆకట్టుకున్నారు. దాంతో వరలక్ష్మికి పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవలే 'జాంబిరెడ్డి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ, నెక్స్ట్ సినిమాగా 'హనుమాన్' చేయబోతున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించే అవకాశాలున్నాయి.