వలపు వల
ABN , First Publish Date - 2022-06-21T05:57:35+05:30 IST
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్.’ స్టయిలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న...

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్.’ స్టయిలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. లవ్లీ స్మైల్‌తో వలపు వల విసురుతూ చాలా స్టయిలిష్ కనిపించారు సాక్షి వైద్య. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందించిన ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలు.