వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా
ABN , First Publish Date - 2022-01-14T05:34:42+05:30 IST
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి...

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. గురువారం వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియో రూపంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ క్యారెక్టర్ చేయనున్నారని ఈ వీడియో చూడగానే అర్థమవుతుంది. భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకొనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయిసౌజన్య. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరోగా మరో చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు’ చిత్రాలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్యార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్నాయి.