సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్..?

స్టైలిష్ డైరెకర్ సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి రెండు సినిమాలు కమిటయి ఉన్నాడు. అక్కినేని అఖిల్‌తో 'ఏజెంట్', పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఇంతలోనే వైష్ణవ్ తేజ్ హీరో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకి కథ దర్శకుడు దశరథ్ అందిస్తున్నాడని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఈ రెండు పూర్తి చేశాక సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేక మధ్యలో గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేస్తాడా అనేది త్వరలో క్లారిటీ రానుంది.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.