మిస్ యూనివర్స్ పోటీల జడ్జిగా ఊర్వసీ రౌతేలా.. ఆమె పారితోషికం ఎంతో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-12-22T01:47:33+05:30 IST
మిస్ యూనివర్స్ పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఊర్వసీ రౌతేలా దాదాపు 1.2 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకుంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు 8 కోట్ల రూపాయలకు సమానం.

ఇంటర్నెట్ డెస్క్: ఊర్వసీ రౌతేలా.. పరిచయం అక్కర్లేని బాలీవుడ్ తార. గతంలో అంతర్జాతీయ పోటీల్లో మెరిసి భారతదేశ పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి తెలిసేలా చేసింది. తన అందచందాలతో బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో న్యాయనిర్ణేతగా పాల్గొని మరోసారి భారత్ పేరుప్రతిష్టలను ఇనుమడింప జేసింది. ఈసారి మిస్ యూనివర్స్‌గా భారతీయురాలు హర్నాజ్ సంధూ ఎంపికైన విషయంలో తెలిసిందే. ఈ పోటీల్లో గెలిచినందుకు అమెకు అందే ప్రైజ్ మనీ గురించి కూడా తెలిసిన విషయమే.
అయితే.. అదే పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఊర్వసీ రౌతేలా దాదాపు 1.2 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకుంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు 8 కోట్ల రూపాయలకు సమానం. ప్రస్తుతం రౌతేలాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశం గర్వించేలా చేశావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక 200 కోట్లతో త్వరలో నిర్మించబోయే ఓ సినిమా ద్వారా ఊర్వసీ.. తమిళ సినిమా రంగంలోనూ ఆరంగేట్రం చేయబోతోందని సమాచారం.