Urfi Javed: ఫోన్‌లో శృంగారం కోసం టార్చర్.. ఇతడేనని బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్..

ABN , First Publish Date - 2022-08-15T15:51:39+05:30 IST

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. అనంతరం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా..

Urfi Javed: ఫోన్‌లో శృంగారం కోసం టార్చర్.. ఇతడేనని బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్..

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). అనంతరం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ పోతోంది. ఈ బ్యూటీ ఏ విషయంలోనైనా చాలా బోల్డ్‌గా ఉంటూ.. ఎటువంటి భయం, మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే.. డిఫరెంట్ ఫ్యాషన్, డ్రెస్సింగ్‌తో పలుమార్లు విమర్శల పాలైంది. అంతేకాకుండా.. తనకి సంబంధించిన విషయాలను చాలా ఓపెన్‌గా నెట్టింట షేర్ చేస్తుంటుంది.


అలాగే.. తన జీవితంలో జరిగిన కొన్ని భయంకర విషయాలను సైతం ఉర్ఫీ తన ఫాలోవర్స్‌లో పంచుకుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య సైతం చేసుకోవాలనుకున్నట్లు గతంలో ఓ సారి చెప్పుకొచ్చింది. తాజాగా గత రెండు సంవత్సరాలుగా ఫోన్‌లో శృంగారం చేయాలంటూ ఇబ్బంది పెడుతున్న  ఓ వ్యక్తి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.


అందులో ఆ వ్యక్తి ఫొటోని సైతం షేర్ చేసింది ఉర్ఫీ.. ‘ఈ మనిషి నన్ను చాలాకాలం వేధిస్తున్నాడు. దాన్ని ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేసి నెట్‌లో షేర్ చేశారు. అప్పుడే దాని గురించి పోలీసులకి ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో నేను నరకం అనుభవించాను. రెండు సంవత్సరాల క్రితమే నా పిక్‌ని  షేర్ చేశాను. అది ఇప్పటికీ నా ప్రొఫైల్‌లో ఉంది. ఈ వ్యక్తి ఆ పిక్‌ని తీసుకొని మార్ఫింగ్ చేశాడు. అప్పటి నుంచి అతనితో వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ (Black mail) చేస్తున్నాడు. లేకుంటే అతను ఆ పిక్‌ని నెట్‌లో అప్‌లోడ్ చేసి నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు.  అతను నన్ను సైబర్ రేప్ చేయడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.


ఇక్కడ నన్ను నిరుత్సాహపరిచింది అతని పనులు కాదు. నేను ఈ నెల ఒకటో తేదిన ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాను. 14 రోజుల అవుతున్న ఇప్పటికీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. ముంబై పోలీసుల గురించి చాలాసార్లు మంచిగా విన్నాను. కానీ ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి విచిత్రంగా ఉంది. అతను ఎంతోమంది మహిళలతో ఇలా ప్రవర్తించాడని చాలా క్లియర్‌గా తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ వ్యక్తి సమాజానికి, మహిళలకు చాలా ముప్పు. అతన్ని స్వేచ్ఛగా వదిలేయకూడదు. దీని తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ పంజాబ్ పరిశ్రమలో స్వేచ్ఛగా పని చేస్తున్న ఈ వ్యక్తి గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నా’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.



Updated Date - 2022-08-15T15:51:39+05:30 IST