Viral Video: నడిరోడ్డుపై దుప్పటి కప్పుకుని ఈ ఫొటోలేంటి.. Urfi Javed పై నెటిజన్ల ఫైర్..

ABN , First Publish Date - 2021-12-03T18:40:01+05:30 IST

బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. ఈ బ్యూటీ ఇటీవలే తన విచిత్రమైన వేషధారణతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కారణంగా ఎన్నోసార్లు నెట్టింట ట్రోలింగ్ సైతం గురైంది ఈ భామ.

Viral Video: నడిరోడ్డుపై దుప్పటి కప్పుకుని ఈ ఫొటోలేంటి.. Urfi Javed పై నెటిజన్ల ఫైర్..

బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. ఈ బ్యూటీ ఇటీవలే తన విచిత్రమైన వేషధారణతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కారణంగా ఎన్నోసార్లు నెట్టింట ట్రోలింగ్ సైతం గురైంది ఈ భామ. అయిన తన విచిత్ర డ్రెసింగ్‌తో వరుస వీడియోలు పెడుతూ సోషల్ మీడియాపై దాడి చేస్తూనే ఉంది. మొన్న రిహన్నా డ్రెసింగ్.. నిన్న మేకప్ లేకుండా.. నేడు ఏకంగా బ్రా లెస్ ఫోటోలతో ట్రోలింగ్‌కి గురైంది ఈ భామ.


తాజాగా ఉర్ఫీ లైట్ బిగి ఔట్‌ఫిట్ ధరించి నడిరోడ్డుపై ఫోటోలకి ఫోజులిచ్చిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షం అయ్యింది. అందులో ఈ బ్యూటీ బ్రా లెస్, బ్యాక్ లెస్ టాప్‌త ఉంది. నడిరోడ్డుపై ఇదేం పనంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.


‘ప్రాజెక్టు రోడ్ వే క్వీన్’ అంటూ కొందరు కామెంట్స్ పెట్టగా.. ‘అరే ఆమె వేసుకున్నలాంటి చద్దర్‌ని ఇంతవరకూ చూడలేదం’టూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఒకరైతే ఇంకా ఫన్నీగా ఆమెని కరోనా వేరియంట్ ఓమిక్రాన్‌తో పోలుస్తూ కామెంట్ చేశాడు.


అయితే ఇంతకుముందు కూడా ఉర్ఫీ ఇలాగే ఓ ఫంక్షన్‌ని ఢిపరెంట్‌గా వెళ్లి ట్రోలింగ్‌కి గురైంది. దానిపై స్పందించిన ఈ బ్యూటీ.. ‘బాలీవుడ్‌లోని స్టార్ కిడ్స్ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏమనకపోగా.. స్టైలిష్ అని ప్రశంసలు కురిపిస్తారు. అదే లక్నోకి చెందిన మధ్య తరగతి అమ్మాయి చేస్తే మాత్రం విమర్శలు కురిపిస్తారా’ అంటూ కౌంటర్ ఇచ్చింది. కాగా తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ ఈ భామ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం..





Updated Date - 2021-12-03T18:40:01+05:30 IST