Bruce Lee: ఈ కుంగ్ ఫూ లెజెండ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన నిజాలివే..

ABN , First Publish Date - 2022-07-31T15:44:41+05:30 IST

బ్రూస్ లీ.. ఈ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడికి ప్రపంచవ్యాప్తంగా..

Bruce Lee: ఈ కుంగ్ ఫూ లెజెండ్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన నిజాలివే..

బ్రూస్ లీ.. ఈ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. పాత మూవీస్‌లో ఆయన చేసిన యాక్షన్ సీన్స్ ఇప్పటికి అబ్బురపడేలా చేస్తుంటాయి. ఆ సినిమాల్లో చాలా సన్నివేశాల్లో ఫైట్స్ ఎటువంటి డూప్, గ్రాఫిక్స్ లేకుండా రియల్‌గా చేయడం విశేషం. సినిమాలతోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్ హైబ్రిడ్ ఫామ్‌గా జీత్ కునే డో (Jeet Kune Do) అనే కొత్త ఫైటింగ్ ఫామ్‌ క్రియేటర్ ప్రసిద్ధి చెందారు. 1965లో బ్రూస్ లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రపంచానికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ నటుడు అభిమానులతో పంచుకున్నారు. ఆ ఆసక్తికరమైన విషయాలను ఏంటో తెలుసుకుందాం..


బ్రూస్ లీ (Bruce Lee) హాంకాంగ్‌ (Hong Kong)లో పుట్టారని చాలామంది నమ్ముతున్నారు. కానీ అది నిజంకాదు.. ఈ లెజెండ్ యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్క్రో నగరంలో పుట్టారు. ఆయన అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివారు. అలాగే.. ఆయన పెద్దయ్యాక సినిమాల్లోకి వచ్చారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది కూడా నిజం కాదు. ఆరు సంవత్సరాల వయస్సులో సినిమాల్లోకి ప్రవేశించాడు. హాంకాంగ్ చలనచిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. అనంతరం హీరోగా మారారు.


అలాగే.. ఫైంటింగ్ గురించి బ్రూస్ లీ మాట్లాడుతూ.. నా అభిప్రాయం ప్రకారం, కుంగ్ ఫూ (Kung Fu) చాలా బాగుంటుంది. అది చైనాలో పుట్టింది. ఇది కరాటే, జియు-జిట్సు‌ కంటే ముందే పుట్టి వాడుకలో ఉంది. ఇందులో అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి’ అని బ్రూస్ లీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఆయన కుంగ్ ఫూ‌ని నీటితో పోల్చారు.


బ్రూస్ లీ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో నీరు అత్యంత మృదువైన పదార్ధం. అయినప్పటికి అత్యంత బలంగా, గట్టిగా ఉండే రాయి లేదా గ్రానైట్ వంటి వాటి నుంచి కూడా దూసుకెళ్లగలదు. అంతేకాకుండా.. నీటిని మనం పట్టుకోలేం. దాన్ని కొట్టలేం కూడా. కుంగ్ ‌ఫూ కూడా అలాంటిదే’ అని తెలిపారు. అంతేకాకుండా.. కుంగ్ ఫూలోని కొన్ని ఫామ్స్‌ని చేసి చూపించారు. ఆ ఇంట్రాస్టింగ్ వైరల్ వీడియోని మీరు చూసేయండి..



Updated Date - 2022-07-31T15:44:41+05:30 IST