'ఆర్టికల్ 15' తమిళ రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్

కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ 'ఆర్టికల్ 15' తమిళ రీమేక్‌లో నటించబోతున్నారు. నిర్మాత నుంచి హీరోగా మారిన ఆయన రీసెంట్‌గా 'సైకో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదితి రావు హైదరి హీరోయిన్‌గా నటించిన ఇందులో గుడ్డివాడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అరుణరాజా కామరాజ్ దర్శకత్వంలో వచ్చిన హిందీ మూవీ 'ఆర్టికల్ 15'. దీనిని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో స్టాలిన్ హీరోగా నటించనున్నారు. ఆగస్టు చివరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. శివానీ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మాగిజ్ తిరుమేనితో దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీలోనూ ఉదయనిధి నటిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమై, ఎలక్షన్స్ కరోనా కారణంగా బ్రేక్ పడింది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.