Mollywood: యంగ్ హీరోయిన్స్‌కు లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-09-28T20:48:01+05:30 IST

ఇద్దరు యంగ్ మలయాళం హీరోయిన్స్‌‌(Mollywood heroines) కు శనివారం రాత్రి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఓ సినిమాలో వీరిద్దరు కలసి నటించారు. ప్రమోషన్‌లో భాగంగా కాలికట్‌లోని హిల్టే మాల్‌కు

Mollywood: యంగ్ హీరోయిన్స్‌కు లైంగిక వేధింపులు

ఇద్దరు యంగ్ మలయాళం హీరోయిన్స్‌‌(Mollywood heroines) తాజాగా లైంగిక వేధింపులకు గురయ్యారు. ఓ సినిమాలో వీరిద్దరు కలసి నటించారు. ప్రమోషన్‌లో భాగంగా కాలికట్‌లోని ఓ మాల్‌కు వెళ్లారు. ప్రచారం అనంతరం మాల్‌ నుంచి బయటికి వస్తున్నప్పుడు వీరిపై లైంగిక దాడి జరిగింది. తమకు లైంగిక వేధింపులు (Harassment) ఎదురయిన విషయాన్ని ఇద్దరు హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

    

జీవితంలో ఎవరికీ కూడా ఇటువంటి షాకింగ్ అనుభవం ఎదురు కాకూడదని ఓ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘మా కొత్త సినిమాను ప్రమోట్ చేసేందుకు కాలికట్‌లోని మాల్‌కు చిత్ర బృందంతో కలసి నేను వెళ్లాను. కాలికట్‌లోని అనేక ప్రాంతాల్లో మేం ప్రచారాన్ని నిర్వహించాం. కాలికట్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. కానీ, మాల్‌ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. జన సమూహాన్ని అదుపు చేయలేక భద్రతా సిబ్బంది ఇబ్బందిపడ్డారు. ప్రచారం అనంతరం నేను, నా సహనటి బయటికి వస్తున్నాం. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సభ్యకరంగా ప్రవర్తించాడు. మాల్‌లో ప్రజలు భారీగా ఉండటంతో ఆమెకు స్పందించే అవకాశం కూడా రాలేదు. అతడి ముఖాన్ని కూడా ఆమె చూడలేదు. తర్వాత, ఇటువంటి ఘటనే నాకు కూడా ఎదురయింది. దీంతో నేను షాక్‌కు గురయ్యాను. జీవితంలో ఎవరికి కూడా ఇటువంటి అనుభవం ఎదరు కాకూడదు. మహిళలపై హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని మాలీవుడ్ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరో నటి కూడా మలయాళంలో పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘జీవితంలో ఎవరికి కూడా ఇటువంటి షాకింగ్ ఘటన ఎదురు కాకూడదని ఆశిస్తున్నాను. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై చిత్ర బృందం చట్టపరమైన చర్యలు తీసకుంటుంది’’ అని ఆ నటి చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశారు. మాల్ నుంచి సీసీటీవీ ఫుటేజీని సేకరించామన్నారు. ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Updated Date - 2022-09-28T20:48:01+05:30 IST