దొంగల బారిన పడిన ‘ Kabir Singh ’ నటి

కబీర్ సింగ్, బిగ్ బుల్ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నికిత దత్తా. తనకు అపరిచిత వ్యక్తుల నుంచి షాకింగ్ అనుభవం ఎదురైందని పేర్కొంది. దీంతో వెక్కి, వెక్కి ఏడ్చానని వెల్లడించింది. ఆ అనుభవాన్ని ఆమె  ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.


‘‘ నాకు నవంబర్ 29న షాకింగ్ అనుభవం ఎదురైంది. నేను ఆ ఘటనతో ఆందోళనకు లోనయ్యాను. కోలుకోవడానికి 24గంటలకు పైగా సమయం పట్టింది. బాంద్రాలోని 14వ నంబర్ రహదారిలో రాత్రి 7.45కు నేను నడుచుకుంటు వెళుతున్నాను. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నా తలపై కొట్టారు. నా ఫోన్‌ను దొంగిలించారు. నేను స్పందించే లోగానే పారిపోయారు ’’ అని నికిత దత్తా తెలిపింది. 


‘‘ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. కొద్ది క్షణాలపాటు షాక్‌కు గురయ్యాను. నేను ఆ ఘటన నుంచి తేరుకునే లోపు వారు పారిపోయారు. ఆ సమయంలో వాకింగ్ చేస్తున్నవారు నాకు ఎంతగానో సాయపడ్డారు. ఒక వ్యక్తి వారిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ, వారు దొరకలేదు. దీంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అనంతరం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసును ఫైల్ చేశాను. ప్రజలకు చైతన్యం కలిగించడానికి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెడుతున్నాను.మరొకరికి ఈ విధంగా జరగకూడదని నేను ఆశిస్తున్నాను. తమ ప్రమేయం లేకుండా కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరు కూడా కొల్పోవద్దు  ’’ అని ఆమె వెల్లడించింది.


ఆమె పెట్టిన పోస్ట్‌కు అనేకమంది బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందించారు. అభిషేక్ బచ్చన్ ఆ పోస్ట్ కింద ‘‘ టేక్ కేర్ ’’ అంటూ కామెంట్ చేశాడు. గోల్డ్, లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, మస్కా వంటి తదితర బాలీవుడ్ చిత్రాల్లో నికిత దత్తా నటించింది.  


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.