ట్విట్టర్‌ ఇండియా: తెలుగు నుంచి వకీల్‌సాబ్‌ ఒకటే!

ABN , First Publish Date - 2021-12-09T23:16:36+05:30 IST

ఈ ఏడాది ట్విట్టర్‌లో మోస్ట్‌ ట్వీటెడ్‌ మూవీస్‌ లిస్ట్‌ను ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాల్లో తెలుగు సినిమా ‘వకీల్‌ సాబ్‌’ స్థ్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్‌, అజిత్‌ సినిమాలు మొదటి రెండు స్థానాలు పొందగా, పవన్‌ కళ్యాణ్‌ 5వ స్థానంలో నిలిచాడు. 2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్‌ చేసిన చిత్రాల్లో విజయ్‌ ‘మాస్టర్‌’ మొదటి స్థానంలో నిలిచింది.

ట్విట్టర్‌ ఇండియా: తెలుగు నుంచి వకీల్‌సాబ్‌ ఒకటే!

ఈ ఏడాది ట్విట్టర్‌లో మోస్ట్‌ ట్వీటెడ్‌ మూవీస్‌ లిస్ట్‌ను ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాల్లో తెలుగు సినిమా ‘వకీల్‌ సాబ్‌’ స్థ్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్‌, అజిత్‌ సినిమాలు మొదటి రెండు స్థానాలు పొందగా, పవన్‌ కళ్యాణ్‌ 5వ స్థానంలో నిలిచాడు. 2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్‌ చేసిన చిత్రాల్లో విజయ్‌ ‘మాస్టర్‌’ మొదటి స్థానంలో నిలిచింది. అజిత్‌ ‘వాలిమై’ రెండో స్థానంలో, విజయ్‌ ‘బీస్ట్‌’ మూడవ స్థానంలో నిలిచింది. సూర్య ‘జై భీమ్‌ నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ నిలిచింది. అయితే తెలుగు నుంచి అత్యధిక ట్వీట్లు చేసిన చిత్రంగా వకీల్‌సాబ్‌ ట్విట్టర్‌ ఇండియా జాబితాలో ఉంది. 


బాలీవుడ్‌లో ఎక్కువ ట్వీట్లు చేసిన హీరోల జాబితాలో మొదటి స్థానంలో సోనూసూద్‌, రెండో స్థానంలో అక్షయ్‌కుమార్‌, మూడో స్థానంలో సల్మాన్‌ఖాన్‌, నాలుగో స్థానంలో షారుక్‌ఖాన్‌, ఐదో స్థానంలో అమితాబ్‌ బచ్చన్‌ ఉండగా, హీరోయిన్స్‌లో అలియాభట్‌, ప్రియాంక చోప్రా, దిశాపాట్నీ, దీపికా పడుకోన్‌, అనుష్కాశర్మ ఉన్నారు. 


Updated Date - 2021-12-09T23:16:36+05:30 IST