పన్నెండు గంటలు... పద్దెనిమిది టేకులు
ABN , First Publish Date - 2021-11-24T05:51:04+05:30 IST
రాజమౌళి ఏం చేసినా, అందులో బోలెడంత మార్కెటింగ్ స్ర్టాటజీ ఉంటుంది. ఓ స్టిల్, ఓ పాట... ఏది విడుదల చేసినా - వెంటనే అది ట్రెండింగ్ అయిపోతుంటుంది. ‘ఆర్.ఆర్.ఆర్’కి సంబంధించిన ప్రతీ విషయం...

రాజమౌళి ఏం చేసినా, అందులో బోలెడంత మార్కెటింగ్ స్ర్టాటజీ ఉంటుంది. ఓ స్టిల్, ఓ పాట... ఏది విడుదల చేసినా - వెంటనే అది ట్రెండింగ్ అయిపోతుంటుంది. ‘ఆర్.ఆర్.ఆర్’కి సంబంధించిన ప్రతీ విషయం... ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్కే. ప్రస్తుతం ‘నాటు... నాటు’ పాట యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి విడుదలైన ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్పు బాగా పాపులర్ అయ్యింది. ఈ స్టెప్పుని అనుకరిస్తూ... వందలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాట గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘‘నిజానికి అది చాలా చిన్న స్టెప్పే. కానీ.. మూమెంట్స్, టైమింగ్ అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ స్టెప్పు కోసం ఏకంగా 18 టేకుల వరకూ తీసుకున్నాం. 12 గంటలు కష్టపడ్డాం. మా కదలికల్లో చిన్న తేడా కనిపించినా రాజమౌళి ‘మరోసారి చేద్దాం’ అనేవారు. ఈ స్టెప్పు కోసం ఇన్ని రీటేకులు ఎందుకో అప్పట్లో అర్థం కాలేదు. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తే.. ఇప్పుడు తెలిసొచ్చింద’’న్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల అవుతోంది.