అఫీషియల్: ‘టక్ జగదీష్’ విడుదల తేదీ ఖరారు
ABN , First Publish Date - 2021-08-27T20:41:31+05:30 IST
‘నిన్నుకోరి’ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. నాని 26వ చిత్రంగా..

‘నిన్నుకోరి’ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. నాని 26వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వినాయక చవితి పండుగ కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘పండుగకి మన ఫ్యామిలీతో మీ ‘టక్ జగదీష్’..’’ అంటూ నాని కూడా ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని చెప్పిన ‘‘భూదేవీపురం చిన్న కొడుకు, నాయుడుగారబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.