ఒకప్పుడు సౌత్‌లో తిరుగులేని కథానాయిక త్రిష కృష్ణన్. దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన హీరోయిన్ గా మెరిసిన ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ లోనూ సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ పేరు ‘బృంద’. ఇందులో ఆమె పవర్ ఫుల్ కాప్ గా నటిస్తున్నారు. తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా పోలీస్ యూనిఫామ్ లో త్రిష కనిపించనుండడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య వంగల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. త్వరలోనే ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది.