గర్భస్రావానికి కారణం... ఆ గాయకుడేనంటూ... కోర్టుకి...

Twitter IconWatsapp IconFacebook Icon
గర్భస్రావానికి కారణం... ఆ గాయకుడేనంటూ... కోర్టుకి...

అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ పై మరో కేసు నమోదైంది. అతడు నిర్వహించిన ‘ఆస్ట్రోవరల్డ్’ కన్సర్ట్ సందర్భంగా తాను ‘‘తొక్కిసలాటకి గురై నలిగిపోయా’’నని ఓ మహిళ కోర్టుకెక్కింది. ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’ అనే పత్రికలోని వార్త ప్రకారం... ‘షనాజియా విలియమ్ సన్’ అనే గర్భవతి 2021లో జరిగిన ఆస్ట్రోవరల్డ్ సంగీత విభావరికి హాజరైంది. అప్పుడు జరిగిన విషాదకర తొక్కిసలాటలో ఆమె ‘‘భయంకరమైన గాయాల’’ పాలైనట్టు కోర్టుకు తెలిపింది. దాని వల్లే అప్పుడు గర్భవతిగా ఉన్న తనకు గర్భస్రావం జరిగిందని షనాజియా విలియమ్ సన్ ఆరోపిస్తోంది. హూస్టన్ నగరంలో పోయిన సంవత్సరం చోటు చేసుకున్న ‘ఆస్ట్రోవరల్డ్’ ప్రమాదం అందర్నీ విభ్రాంతికి గురి చేసింది...


2021, నవంబర్ 5న ట్రావిస్ స్కాట్ నేతృత్వంలో ‘ఆస్ట్రోవరల్డ్ కన్సర్ట్’ ప్రారంభమైంది. అదే రోజు భారీగా జనం వచ్చేయటంతో తొక్కిసలాట జరిగింది. ఆ గందరగోళంలో అనేక మంది కిందపడి, ఇతరుల కాళ్ల కింద నలిగిపోయారు. వందల మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వార్ని హాస్పిటల్ కి తరలించాల్సి వచ్చింది. అయితే, ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తరువాత ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మృతి చెందారు. ‘ఆస్ట్రోవరల్డ్ కన్సర్ట్’లో పాడాల్సి ఉన్న ర్యాపర్ ట్రావిస్ స్కాట్ పై ఇప్పటికే అనేక మంది కేసులు నమోదు చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో తాజాగా షనాజియా విలియమ్ సన్ కూడా కోర్టు గడప తొక్కారు. తన గర్భం పోవటానికి కారణం స్కాటేనంటూ ఆమె ఆరోపిస్తున్నారు. చూడాలి మరి, ఎలాంటి తీర్పు వస్తుందో... 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.