వివాదస్పదమైన మరాఠీ సినిమా.. సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్‌సీడబ్ల్యూ.. ట్రైలర్‌ తొలగింపు..

మరాఠీ సినిమా ‘‘ నయ్ వరణ్ భట్ లోంచా కొన్ నయ్ కొంచా ’’ వివాదంలో చిక్కుకొంది. మహిళలు, చిన్న పిల్లలను అసభ్యకరంగా చిత్రీకరించారని ఆ సినిమాపై తీవ్ర దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ)  ఆ సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ట్రైలర్‌ను అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల నుంచి చిత్ర నిర్మాతలు తొలగించారు. బాలీవుడ్ నటుడైన మహేశ్ మంజ్రేకర్ ఆ మూవీకి దర్శకత్వం వహించారు. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు ‘‘ ఏ ’’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 


ఆ సినిమా నిర్మాత  శ్రేయాన్స్ హిరావత్ ఆ వివాదంపై స్పందించారు. ‘‘ సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసిన ట్రైలర్‌ను సెన్సార్ చేశాం. 18ఏళ్లకు పైబడిన వారు మాత్రమే చూసేలా ట్రైలర్‌ను డిజైన్ చేశాం. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ట్రైలర్‌లో కూడా వయస్సును ప్రస్తావించాం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎవరికీ నియంత్రణ లేదు. ఆ ప్లాట్‌ఫాంల నుంచి ట్రైలర్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోని షేర్ చేసే అవకాశం ఉంది. ఎన్‌సీడబ్ల్యూ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై కూడా దృష్టి సారించాం. ఎవరి మనో భవాలను కించపరిచలానే ఉద్దేశం మాకు లేదు. అందువల్ల ట్రైలర్‌ను అన్ని ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాం ’’ అని ఆయన చెప్పారు.  


తాజాగా ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ ( ఎన్‌సీపీసీఆర్ ) ఆ సినిమా నిర్మాతలకు వ్యతిరేకంగా ఎఫ్ఐ‌ఆర్‌ను నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఆ సినిమా ట్రైలర్‌ను సెన్సార్ చేయాలని ఎన్‌సీడబ్ల్యూ  ఛైర్ పర్సన్ రేఖా శర్మ భారత్ సమాచార మంత్రిత్వ శాఖకు కొన్ని రోజుల క్రితమే లేఖ రాశారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.