మెగా హీరోలతో భారీ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారట ఓ అగ్ర నిర్మాత. ఆయనెవరో కాదు డీవీవీ దానయ్య. ఆయన నిర్మాణంలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నిర్మించిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను నిర్మిచేందుకు దానయ్య ప్లాన్ చేస్తున్నారట. అదికూడా మెగా హీరోలతో అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. ఇక రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ నిర్మించిన దానయ్య..చరణ్ హీరోగా ప్రశాంత్ డైరెక్టర్‌గా ఓ యాక్షన్ సినిమాను నిర్నించనున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. ఇవి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తారట. దీనిని తేరి చిత్రానికి రీమేక్‌గా రూపొందించనున్నట్టు, త్రివిక్రమ్ డైలాగ్స్- స్క్రీన్ ప్లే అందించనున్నారని సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. కాగా, ప్రభాస్, మారుతిల కాంబోలో కూడా దానయ్య ఒక సినిమాను త్వరలో ప్రకటించనున్నారు.