చాలా పాతదిగా కనిపిస్తున్న ఈ ఇంటిని ఏకంగా రూ.183 కోట్లకు కొన్నారు.. ఇంతకీ ఈ ఇల్లు ఏ సెలబ్రెటీదంటే..

ABN , First Publish Date - 2022-06-18T21:29:33+05:30 IST

ముంబై మహానగరంలో ఇల్లు, భూముల ధరలు ఆకాశనంటుతాయన్న సంగతి తెలసిందే. తాజాగా ఓ సెలబ్రిటీకి చెందిన ఇంటిని రియల్ ఎస్టేట్ డెవలపర్ రూ. 183కోట్లకు కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే..

చాలా పాతదిగా కనిపిస్తున్న ఈ ఇంటిని ఏకంగా రూ.183 కోట్లకు కొన్నారు.. ఇంతకీ ఈ ఇల్లు ఏ సెలబ్రెటీదంటే..

ముంబై మహానగరంలో ఇల్లు, భూముల ధరలు ఆకాశనంటుతాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సెలబ్రిటీకి చెందిన ఇంటిని రియల్ ఎస్టేట్ డెవలపర్ రూ. 183కోట్లకు కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. లెజెండరీ ఫిల్మ్ మేకర్ బీఆర్. చోప్రా (BR Chopra) కుటుంబానికీ ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని బీఆర్. హౌస్ (BR House) అని పిలుస్తుంటారు. ఈ విలాసవంతమైన బంగ్లా ముంబైలో ఖరీదైన ప్రాంతమైన జుహులో ఉంది. దాదాపుగా 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. బీఆర్. చోప్రా కోడలు రేణు రవి చోప్రా (Renu Ravi Chopra)ఈ ఇంటిని రూ. 183కోట్లకు రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు అమ్మేసింది. అందుకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ రూ. 11కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించింది. గతంలో ఈ ఇల్లు బీఆర్. చోప్రాకు బిజినెస్ హబ్‌గా ఉండేది. ఈ ఇంటిలోనే అతడు 2008లో మరణించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఇంటిని కూల్చేసి విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. 


బీఆర్. చోప్రా అసలు పేరు బల్దేవ్ రాజ్ చోప్రా. ‘దూల్ కా ఫూల్’, ‘వక్త్’, ‘నయా దౌర్’, ‘కానూన్’, ‘నిఖా’ వంటి హిట్ సినిమాలను నిర్మించాడు. భారీ తారగణంతో ‘ద బర్నింగ్ ట్రైన్’  (The Burning Train) యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించాడు. ‘మహాభారత్’ (Mahabharat) సీరియల్‌ను రూపొందించి రికార్డ్ క్రియేట్ చేశాడు. బీఆర్. చోప్రాకు ‘బీఆర్. ఫిలిమ్స్’ అనే సొంత బ్యానర్ కూడా ఉంది. అతడు 2008, నవంబర్ 5న మృతి చెందాడు.



Updated Date - 2022-06-18T21:29:33+05:30 IST