విల్‌స్మిత్ నుంచి షారూఖ్ వరకు ఇతరుల చెంప చెళ్లుమనిపించిన సెలబ్రిటీలు..

Twitter IconWatsapp IconFacebook Icon
విల్‌స్మిత్ నుంచి షారూఖ్ వరకు ఇతరుల చెంప చెళ్లుమనిపించిన సెలబ్రిటీలు..

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి 27న ప్రదానం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ అకాడమీ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా హోస్ట్ క్రిస్ ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌పై జోక్ వేశాడు. దీనికి విల్ స్మిత్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. క్రిస్ చెంప పగలగొట్టాడు. ఈ ఘటనతో అక్కడున్న ఆహుతులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో అనేక మంది సెలబ్రిటీలు గతంలో ఇతరుల చెంప చెళ్లుమనిపించారు. అలాంటి వారి జాబితాపై ఓ లుక్కేస్తే..


షారూఖ్ ఖాన్: 

షారూఖ్ హీరోగా తెరకెక్కిన ‘రా.వన్’ చిత్రాన్నిఅవమానిస్తూ ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్ ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. సంజయ్ దత్ 2012లో ఓ పార్టీని హోస్ట్ చేశాడు. ఈ పార్టీలో కింగ్ ఖాన్, శిరీష్ ఎదరుపడ్డారు. తనకు వ్యతిరేకంగా ఎందుకు ట్వీట్ చేశావని బాలీవుడ్ బాద్ షా అడిగాడు. శిరీష్ సమాధానం ఇవ్వకపోవడంతో రెచ్చిపోయి అతడిపై దాడికి పాల్పడ్డాడు.  


సల్మాన్ ఖాన్:

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్‌కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే, ‘భారత్’ సినిమాలో సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీమీయర్ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ అతడిని చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఓ యంగ్ అభిమానితో సల్లూ భాయ్ బాడీగార్డు ఘోరంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భాయ్‌జాన్ సెక్యూరిటీ గార్డు చెంప చెళ్లుమనిపించాడు.  


గోవిందా: 

కామెడీ పాత్రలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోవిందా. ‘మనీ హై తో హానీ హై’ లో అతడు హీరోగా నటించాడు. ఈ సినిమా సెట్‌కు ఓ సందర్శకుడు వచ్చి.. మహిళలతో గోవిందా అసభ్యంగా ప్రవర్తించడాని ఆరోపించాడు. దీంతో ఆవేశానికి లోనైన అతడు అందరూ చూస్తుండగానే అతణ్నికొట్టాడు. 


నగ్మా: 

టాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లో నటించి పేరు తెచ్చుకున్న కథానాయిక నగ్మా. సినిమాలకు టాటా చెప్పి ఆమె రాజకీయ నాయకురాలిగా మారిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌, మీరట్‌లో జరిగిన ఓ సమావేశానికి ఆమె ఓ సారి హాజరైంది. ఆ సమయంలో ఓ వ్యక్తి నగ్మా శరీర భాగాలను తడిమాడు. దీంతో ఆమె అతడి చెళ్లుమనిపించింది.


అక్షయ్ కుమార్: 

వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా అక్షయ్ కుమార్‌కు పేరుంది. కానీ,  ప్రియాంక చోప్రా సెక్రెటరీ ప్రకాష్ జాజును ఖిలాడీ హీరో ఓ సారి కొట్టాడు. తాను ప్రియాంకతో డేటింగ్ చేస్తున్నాననే పుకార్లను ప్రకాష్ ప్రచారం చేస్తున్నడని అక్షయ్ ఆరోపించాడు. దీంతో ఖిలాడీ హీరో  ప్రకాష్ చెంపను పగలగొట్టాడు.



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.