'తూఫాన్' ట్రైలర్ డేట్ ఫిక్స్

ఫ‌ర్హాన్ అక్త‌ర్ హీరోగా తెర‌కెక్కిన బాలీవుడ్ మూవీ 'తుఫాన్‌'. రాకేశ్ ఓంప్ర‌కాశ్ మెహ్రా ద‌ర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఈ చిత్ర ట్రైలర్​ను జూన్​ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'భాగ్ మిల్కా భాగ్‌' బ్లాక్ బస్టర్ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌- రాకేశ్‌ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వ‌స్తోన్న ఈ చిత్రం మీద భారీ అంచ‌నాలు వున్నాయి. ఇందులో పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.