విమాన రెక్కలపై టామ్ క్రూజ్ సాహసం

ABN , First Publish Date - 2021-12-01T20:40:26+05:30 IST

హాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాసిబుల్ 8’. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాయి. సీక్రెట్ ఏజెంట్ ఈథన్ హంట్ గా ఆయన పెర్ఫార్మెన్స్, స్టంట్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సిరిస్ లో ఎనిమిదో సినిమాలో టామ్ ప్రస్తుతం నటిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ‘మిషన్ ఇంపాసిబుల్ : ఫాల్ అవుట్’ చిత్రం ఘన విజయం సాధించింది.

విమాన రెక్కలపై టామ్ క్రూజ్ సాహసం

హాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాసిబుల్ 8’. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాయి. సీక్రెట్ ఏజెంట్ ఈథన్ హంట్ గా ఆయన పెర్ఫార్మెన్స్, స్టంట్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ సిరిస్ లో ఎనిమిదో సినిమాలో టామ్ ప్రస్తుతం నటిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ‘మిషన్ ఇంపాసిబుల్ :  ఫాల్ అవుట్’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో  ‘మిషన్ ఇంపాజిబుల్’ 7, 8 భాగాల్ని ఒకేసారి ప్రకటించారు. ఇటీవల 7 భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే టామ్ క్రూజ్ ఎనిమిదో భాగం చిత్రీకరణ మొదలు పెట్టారు. ఈ సినిమాలో ఆయనో ప్రమాదకరమైన విన్యాసాన్ని ఎలాంటి బాడీ డబుల్ లేకుండా చేయడం అందరికీ షాకింగ్ గా మారింది.


‘మిషన్ ఇంపాసిబుల్ 8’ చిత్రం కోసం టామ్ క్రూజ్ 1941 బోయింగ్ B7591 స్టీర్ మ్యాన్ బై ప్లేన్ 2000 అడుగుల ఎత్తులో ఉండగా.. కాక్ పిట్ నుండి రెక్కపైకి ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత రెక్కలపై నుంచి తలక్రిందులుగా వ్రేళ్ళాడారు. అలా వ్రేళ్ళాడే క్రమంలో 80 ఏళ్ళ నాటి ఆ యుద్ధ విమానం పల్టీలు కొట్టింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ విన్యాసం ద్వారా టామ్ రెక్కపైకి ఎక్కి కూర్చున్నారు. ఈ విషయాన్ని ఫ్యాక్స్ న్యూస్ ప్రచురించింది. ఈ సినిమాలోని పాత్రకోసం ఆయన స్టార్ ఫైయింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-12-01T20:40:26+05:30 IST