ఒకే సినిమాలో ఇటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు నటిస్తే ఆ మల్టీస్టారర్ మూవీపై భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడుతుంది. సాధారణంగా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ అవడం చాలా కష్టం. అలాంటి కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే వారు సెట్ చేసి ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 'కేజీఎఫ్' (KGF) ప్రాంచైజీతో హోంబలే ఫిలింస్ (Homebale Filims) నిర్మాణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.
ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయి. ఇప్పటికే, 'కేజీఎఫ్' ప్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), (Prabhas), గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో 'సలార్' (Salaar) రూపొందుతోంది. ఇదే క్రమమంలో మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ని ఈ సంస్థ లాక్ చేస్తోంది. అన్నీ ఇండస్ట్రీలలోని టాప్ డైరెక్టర్స్, హీరోస్తో కాంబోను ఫిక్స్ చేస్తున్నారు. అలా సెట్ చేసిన కాంబో టాలీవుడ్ యంగ్ హీరో నాని (Nani), కోలీవుడ్ స్టార్ సూర్య (Surya), మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). వీరితో లేడీ డైరెక్టర్ సుధ కొంగర (Sudha Kongara) ఓ భారీ చిత్రాన్ని రూపొందించనున్నారట.
నిన్నా మొన్నటి వరకు హోంబలే సంస్థలో సూర్య - దుల్కర్ సల్మాన్ హీరోలుగా సుధ కొంగర మల్టీస్టారర్ తెరకెక్కించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో మన టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని కూడా నటించబోతున్నాడట. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కించి పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయనున్నారట. మరి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి.