ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత నిర్మాత వెంకట్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-09-27T14:42:11+05:30 IST

ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్ని సంబంధిత వ్యాధికి చికిత్సపొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వెంకట్ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత నిర్మాత వెంకట్ కన్నుమూత

ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు. కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్సపొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వెంకట్ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ‘సామాన్యుడు,ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మేన్, పైసా, ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ లాంటి చిత్రాలు నిర్మించారు. వెంకట్ మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-27T14:42:11+05:30 IST