వినాయక చవితికి ఆ చిత్రాల విడుదల ఖాయమేనా?

ABN , First Publish Date - 2021-08-14T00:08:17+05:30 IST

మామూలు రోజుల కన్నా పండగల సమయంలో థియేటర్ల దగ్గర ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వరుస సెలవులు ఉండడంతో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద వాలిపోతారు. అందుకే పండగ సీజన్‌ అంటే సినిమా పరిశ్రమలో కోలాహలం మొదలువుతుంది. అందుకే ఆ రోజుల్లో వచ్చే సినిమాలకు రెట్టింపు వసూళ్లు దక్కుతుంటాయి.

వినాయక చవితికి ఆ చిత్రాల విడుదల ఖాయమేనా?

మామూలు రోజుల కన్నా పండగల సమయంలో థియేటర్ల దగ్గర ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వరుస సెలవులు ఉండడంతో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద వాలిపోతారు. అందుకే పండగ సీజన్‌ అంటే సినిమా పరిశ్రమలో కోలాహలం మొదలువుతుంది. అందుకే ఆ రోజుల్లో వచ్చే సినిమాలకు రెట్టింపు వసూళ్లు దక్కుతుంటాయి. కరోనా కారణంలో థియేటర్ల మూతపడడంతో పండగ సీజన్‌ అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో నిర్మాతల్లో కాస్త ఉత్సాహం పెరిగింది. అందుకే రాబోయే పండుగ సీజన్‌ని బాగా వినియోగించుకోవాలని ఫిక్స్‌ అయ్యారు. ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలను ఆల్మోస్ట్‌ పెద్ద సినిమాలు ఆక్యుపై చేసేశాయి. వాటికన్నా ముందు వచ్చే వినాయక చవితి డేట్‌ మాత్రం ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. కాపీ రెడీ అయిన చిత్రాలు ఆ తేదీని బ్లాక్‌ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 


కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. విడుదలకు ఉన్న సినిమాలు క్యూ కట్టాయి. గడిచిని రెండు వారాల్లో ప్రతి శుక్రవారం అరడజనుకు తగ్గకుండా సినిమాలు విడుదలయ్యాయి. సక్సెస్‌ విషయం పక్కన పెడితే.. ఎంతోకొంత జనాల్ని థియేటర్లకు తీసుకొచ్చాయి. దాంతో నిర్మాతలకు కాస్త ధైర్యం వచ్చింది. పండగ సీజన్‌ మీద భరోసా పెంచుకున్నారు. అందుకే పెద్ద చిత్రాలతో పండుగ తేదీలను బ్లాక్‌ చేశారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఇప్పటికే చాలా డేట్స్‌ అనుకుని ఎట్టకేలకు అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చిరంజీవి ‘ఆచార్య’ కూడా దసరా బరిలో ఉందనే వార్తలు వస్తున్నాయి. దీపావళికి ‘గని’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. క్రిస్మన్‌కు అల్లు అర్జున్‌ ‘పుష్ప’, యశ్‌ నటించిన ‘కెజీఎఫ్‌’ చిత్రాలు రేసులో ఉన్నాయి. సంక్రాంతికి అయితే దాదాపు నాలుగు సినిమాలు పోటీపడనున్నాయి. పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌ రాధేశ్యామ్‌’, మహేశ్‌ ‘సర్కారువారి పాట’ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. కుదిరితే ‘ఎఫ్‌2’ కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం ఉంది. 


అయితే ఇప్పుడు చర్చ అంతా వినాయక చవితి పండుగ గురించే! ఈ ఏడాది వినాయక చవితి డేట్‌కి ఇంకా ఏ చిత్రం విడుదల ప్రకటించలేదు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ‘టక్‌ జగదీష్‌’, ‘లవ్‌స్టోరీ’ చిత్రాల విడుదల ఓ కొలిక్కి రాలేదు. గోపీచంద్‌ ‘సిటీమార్‌’, సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’, నితిన్‌ ‘మాస్ర్టో’, నాగశౌర్య ‘వరుడు కావలెను’, ‘మంచి రోజులొచ్చాయి’, ‘పెళ్లిసందడి’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. మరో వారంలో ఫస్ట్‌ కాపీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకూ థియేటర్ల పరిస్థితి చూసి సెప్టెంబర్‌ మొదటివారం, వినాయక చవితి టార్గెట్‌గా ఈ చిత్రాల విడుదల తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది. 

Updated Date - 2021-08-14T00:08:17+05:30 IST