ఈ కమెడియన్లను ‘హౌస్ అరెస్ట్’ చేసేది ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-08-16T23:45:52+05:30 IST
మా చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీల్లో విడుదల చేయడానికి కొందరు సంప్రదించి, భారీ ఆఫర్స్ ఇచ్చినా వద్దనుకున్నాం. కారణం థియేటర్స్‌లోనే అసలు కిక్ ఉంటుందని భావించి, చిత్రాన్ని థియేటర్స్‌లో

నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ‘90 ఎం.ఎల్’ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీల్లో విడుదల చేయడానికి కొందరు సంప్రదించి, భారీ ఆఫర్స్ ఇచ్చినా వద్దనుకున్నాం. కారణం థియేటర్స్‌లోనే అసలు కిక్ ఉంటుందని భావించి, చిత్రాన్ని థియేటర్స్‌లో ఆగస్ట్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాము..’’ అని తెలిపారు. రవిబాబు, అదుర్స్ రఘు, రవి ప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.