Friendship day: టాలీవుడ్‌ దోస్తానా...

ఆనాటి ఆ స్నేహ ఆనంద గీతం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం..

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. 

మీసమున్న నేస్తమా నీకూ రోషమెక్కువా...

దోస్ట్‌ మేరా దోస్ట్‌ తూహై మేరీ జాన్‌..

పాటలు, పల్లవులు ఎన్నైనా... అన్నీ చెప్పేది స్నేహం కోసమే!

బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు ఉన్నా లేకపోయినా మంచి మిత్రుడు ఒకడుంటే చాలు అంటారు. అదీ స్నేహానికి ఉన్న గొప్పతనం. టాలీవుడ్‌లో ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చే స్నేహితులు చాలామందే ఉన్నారు. అలాగే పదిమందిగా కలిసి స్నేహితుల గ్యాంగ్‌లు ఉన్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ తారలపై ఓ లుక్కేద్దాం...


ప్రభాస్‌ – గోపీచంద్‌

సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ప్రభాస్‌, గోపీచంద్‌ స్నేహితులు. గోపీకృష్ణ ఆఫీస్‌కు  దగ్గర్లో ‘కందిరీగ’ శ్రీను, రాధాకృష్ణ ఉండేవారు. అప్పుడప్పుడు అక్కడికి  ప్రభాస్‌ వస్తుండేవారు. అలా ఒకరికొకరు పరిచయం అయ్యారు.  ఇద్దరి మధ్య ర్యాపో, క్లోజ్‌నెస్‌ పెరగడంతో స్నేహం బలపడింది. అది ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఏది ఉన్న ముఖం మీదే మాట్లాడుకోవడం ఇద్దరికీ అలవాటు. తీరిక సమయాల్లో సరదాగా కలుస్తుంటారు. ఇద్దరి మధ్య సినిమాల గురించే కాకుండా బయట విషయాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌ కావడం, బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించడం చాలా ఆనందంగా, గర్వంగా భావిస్తుంటారు గోపీచంద్‌. అలాగే ప్రభాస్‌కి తమన్నా,  స్టైలిస్ట్‌ భాస్కి కూడా మంచి స్నేహితులే! 


సాయిధరమ్‌ తేజ్‌ – నవీన్‌ విజయ్‌కృష్ణ

సాయిధరమ్‌ తేజ్‌, నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. చెన్నైలో క్రికెట్‌ ఆటతో వీరిద్దరి స్నేహం సూపర్‌స్టార్‌ కృష్ట ఇంట్లో మొదలైంది. ఇద్దరూ ఒకే ఇంటి బిడ్డలా మెలుగుతారు. ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటారు. సాయితేజ్‌ లోఫేజ్‌ ఉన్న సమయంలో తనకి బెస్ట్‌ సపోర్ట్‌ నవీన్‌ అని తేజ్‌ చెబుతుంటారు. 

తమన్నా – శ్రుతీహాసన్‌ 

తమన్నా, శ్రుతీహాసన్‌ ఓ అవార్డు ఫంక్షన్‌లో స్నేహితులయ్యారు. అక్కడే ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. తరచూ మాట్లాడుకుంటుండేవారు. కొద్ది రోజులకి ఆ స్నేహ బంధం బలపడి ప్రాణ స్నేహితుల్లా మారారు. ఇదంతా ఆరు నెలల్లోనే జరిగిందని తమన్నా, శ్రుతీ చెబుతుంటారు. ఇద్దరు కలిస్తే అల్లరే అల్లరి. సరదాగా కార్లో చక్కర్లు కొడుతుంటారు. అయితే వీరిద్దరి మధ్య ఓ డౌట్‌ ఉంటుంది. ఈ ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. అసలు వీరిద్దరూ ఎలా స్నేహితులు అయ్యారనే అనుమానం వీరికే కాదు చాలామందికి ఉంది. వృత్తిని గౌరవించడం, నిబద్ధతతో పని చేయడం, హెల్దీ ఫుడ్‌ తీసుకోవడం, సరిపడినంత సమయం నిద్రపోవడం ఈ ఇద్దరిలో కామన్‌గా ఉన్న గుణాలు. ఇద్దరికీ పెట్స్‌ అంటే ఇష్టం. ‘‘ఒకరి నుంచి ఒకరం ఏదొక విషయం నేర్చుకుంటుంటాం. నేనైతే తమన్నా నుంచి డిసిప్లిన్‌ నేర్చుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. 

రాశీఖన్నా – లావణ్యా త్రిపాఠీ

లావణ్యా త్రిపాఠీకి టాలీవుడ్‌లో స్నేహితులు తక్కువ... రాశీఖన్నాను మాత్రం మంచి స్నేహితురాలిగా భావిస్తారు.  ‘‘ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి. చేసే పనిని, కుటుంబాన్ని ప్రేమించడం మా ఇద్దరిలో ఉన్న కామన్‌ క్వాలిటీ. ఖాళీ దొరికితే.. మాత్రం ఫ్యామిలీతో గడపడానికి చూస్తాం. ఇద్దరం నెలలో ఒకసారైనా కలుస్తాం. మా ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉంటాయి. ఓ సందర్భంలో తను నాకు ఇచ్చిన పాస్‌పోర్ట్‌ పౌచ్‌ ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. నేను తనకి ఏ బహుమతీ ఇవ్వలేదు’’ అని లావణ్యా చెప్పారు. 

పదిమంది క్రేజీ స్నేహితులు..

రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రెజీనా, మంచులక్ష్మీ, రాశీఖన్నా, రవితేజ, రానా, అఖిల్‌, సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, మంచు మనోజ్‌, నవదీప్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే! ఆరేళ్ల క్రితం ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. వాట్సాప్‌ గ్రూప్‌లో సంభాషించుకుంటారు. తీరిక సమయంలో సరదాగా కలుస్తుంటారు. వృత్తి పరమైన ముచ్చట్లే కాకుండా వ్యక్తిగత విషయాలు, కష్టసుఖాలు పంచుకోవడం చేస్తుంటారు. ఈ టీమంతా క్రాంకీగా సరదాగా ఉంటుంది. ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలన్నా ముందుకొస్తారు. ఈ టీమ్‌ మొత్తాన్ని నడిపించేది రకుల్‌. 

13 మందితో ఫ్లయింగ్‌ కలర్స్‌

ఐదు మంది ఉన్న చోట ఒక్కోక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అదే పదమూడు మంది ఉంటే రోజుకో మాట, సర్దుబాట్లు ఇలా చాలానే ఉంటాయి. కొన్నేళ్లగా 13 మంది స్నేహితులు ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’ పేరుతో ఓ గ్రూప్‌ నడుపుతూ సరదాగా గడుపుతున్నారంటే ఎంతో అండర్‌స్టాండింగ్‌ ఉండాలి. వారి మధ్య ఉన్న స్నేహబంధమే అందుకు కారణం అంటున్నారు నటుడు శ్రీనివాస్‌ రెడ్డి. ‘వెన్నెల’ కిశోర్‌, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్‌, సత్య, ప్రవీణ్‌, వేణు, నవీన్‌ నేని, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, సప్తగిరి, నందు, రఘు, శ్రీనివాసరెడ్డి.. ఈ 13 మంది మంచి ేస్నహితులు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ ేస్నహాన్ని కొనసాగిస్తున్నారు. వీరి మధ్య వృత్తి, వ్యక్తిగతంగా స్థాయిని పట్టించుకోరు. ఈ 13 మంది నెలకోసారి కలుస్తుంటారు. ఆ సమయంలో అందరికీ డ్రెస్‌ కోడ్‌ ఉంటుది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.