టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. OTT లో ఈ రోజు విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సీరీస్‌ల లిస్ట్ ఇదే..

వీకెండ్ అంటే చాలు సినీ ప్రియులు ఈ వారం ఏ సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఒకప్పుడు సినిమాలను చూడాలంటే థియేటర్ లేదా టీవీనే మార్గం. అయితే నెట్ వినియోగం మారిన ఈ నెట్ యుగంలో ఓటీటీలు వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చాయి. అందులో కొత్త సినిమాలు డైరెక్ట్‌గా విడుదల అవడమో లేక నెలల వ్యవధిలో విడుదలవుతుండడంతో ప్రేక్షకులంతా ఎప్పుడూ వాటిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. కాగా, ఈ రోజు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. ఓటీటీలో ఈ రోజు విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సీరీస్‌ల లిస్ట్ గురించి తెలుసుకుందాం..


1. మంచి రోజులొచ్చాయి

వినూత్న కథాంశాలతో సినిమాలు తీసే టాలీవుడ్ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మంచి రోజులొచ్చాయి’. సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇంతకుముందే థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌పామ్ ‘ఆహా’లో విడుదలైంది.


2. బాబ్ బిశ్వాస్

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బాబ్ బిశ్వాస్’. 2012లో వచ్చిన సుజోయ్ ఘోష్ మూవీ ‘కహాని’లో ఓ క్యారెక్టర్‌కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బెంగాలీ నటుడు సస్వత చటర్జీ ఆ పాత్రని చేయగా..  ఇప్పుడు ఈ ‘ధూమ్’ స్టార్‌తో పూర్తి సినిమాని తీసుకొస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఈరోజు ‘జీ 5’లో విడుదలైంది.3. సూర్యవంశీ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అందాల తార కత్రినా కైఫ్ జంటగా నటించిన  చిత్రం ‘సూర్యవంశీ’. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పోలీస్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.


కాగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి లిస్ట్  ఇలా..


సినిమా
విభాగం
జోనర్
భాష
ప్లాట్‌ఫామ్
విడుదల తేదీ
Manchi Rojulochaie
సినిమాకామెడీ, ఫ్యామిలీ
తెలుగుఆహా

డిసెంబర్ 3

Chithirai Sevvaanam
సినిమా
డ్రామా 
తెలుగు, తమిళంజీ5డిసెంబర్ 3
Sooryavanshi
సినిమాయాక్షన్, డ్రామా, క్రైమ్హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్

నెట్‌ఫ్లిక్స్

డిసెంబర్ 3
Bob Biswasసినిమాక్రైమ్, థ్రిల్లర్హిందీజీ5డిసెంబర్ 3
Relationship Counsellor
టీవీ షోరొమాన్స్, ఫాంటసీహిందీఉల్లూడిసెంబర్ 3
Inside Edge Season 3
టీవీ షోడ్రామాహిందీఅమెజాన్డిసెంబర్ 3
Cobalt Blue
సినిమారొమాన్స్, డ్రామాఇంగ్లీష్, హిందీ, మలయాళంనెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 3
Sivakumarin Sabadham
సినిమాడ్రామాతమిళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్డిసెంబర్ 3
Kayamai Kadakka
సినిమాయాక్షన్, డ్రామా, థ్రిల్లర్తమిళంమూవీ సైన్స్ట్డిసెంబర్ 3Devalokha
సినిమాడ్రామామలయాళంనీ స్ర్ట్రీమ్డిసెంబర్ 3
Diary of a Wimpy Kid
సినిమాయానిమేషన్, కామెడీ, ఫ్యామిలీఇంగ్లీష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్డిసెంబర్ 3
Duneసినిమాయాక్సన్, అడ్వెంచర్ఇంగ్లీష్
బుక్ మై షోడిసెంబర్ 3
Azorసినిమాడ్రామాఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్మోబీడిసెంబర్ 3
It's Always Sunny in Philadelphia Season 15
టీవీ షోకామెడీ, డ్రామాఇంగ్లీష్డీస్నీ ప్లస్ హాట్‌స్టార్డిసెంబర్ 3
Single All the Way
సినిమారొమాన్స్, కామెడీ, డ్రామాఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 3
Puksatte Lifu Pursotte Illa
సినిమాకామెడీ, డ్రామా
కన్నడజీ5డిసెంబర్ 3
Money Heist: From Tokyo to Berlin Vol 2
టీవీ షోడాక్యుమెంటరీస్పానిష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 3
Money Heist: From Tokyo to Berlin Vol 2
టీవీ షో
డ్రామా, క్రైమ్
స్పానిష్
నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 3
Sainz: Live to compete
టీవీ షో
డాక్యుమెంటరీ
స్పానిష్
అమెజాన్డిసెంబర్ 3Boli
టీవీ షో
డ్రామా
బెంగాలీ
హయ్‌చోయి
డిసెంబర్ 3


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.