TNR: ద వరల్డ్‌ ఆఫ్‌ కపట ట్రైలర్‌!

ABN , First Publish Date - 2022-08-13T02:42:53+05:30 IST

దివంగత జర్నలిస్ట్‌, సినీ విమర్శకుడు టీఎన్‌ఆర్‌ నటించిన ‘ద వరల్డ్‌ ఆఫ్‌ కపట’ ట్రైలర్‌ శుక్రవారం విడుదల చేశారు. 12వ దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి అతిపెద్ద లఘు చిత్రంగా అవార్డ్‌ దక్కించుకున్న చిత్రమిది. మల్లినాథ్‌ హర్ష దర్శకత్వం వహించారు.

TNR: ద వరల్డ్‌ ఆఫ్‌ కపట ట్రైలర్‌!

దివంగత జర్నలిస్ట్‌, సినీ విమర్శకుడు టీఎన్‌ఆర్‌ (TNR)నటించిన ‘ద వరల్డ్‌ ఆఫ్‌ కపట’ (THE WORLD OF KAPATA )ట్రైలర్‌ శుక్రవారం విడుదల చేశారు. 12వ దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి అతిపెద్ద లఘు చిత్రంగా అవార్డ్‌ దక్కించుకున్న చిత్రమిది. మల్లినాథ్‌ హర్ష (Mallinath harsha) దర్శకత్వం వహించారు. సిరి యెనిగళ్ల నిర్మాత. టీఎన్‌ఆర్‌ నటించిన చివరి చిత్రమిది. ఈ నెల 18న ‘ఛాయ్‌ బిస్కెట్‌’ యూ ట్యూబ్‌ ఛానల్‌లో విడుదల కానుంది. ఈ మేరకు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ వ్యక్తికి, మాట్లాడే మాస్క్‌ల మధ్య సాగే కథగా ట్రైలర్‌లో చెప్పారు. ఓ చిన్నారి వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. కథానుగుణంగా నేటివిటీ కోసం రిమోట్‌ ఏరియాల్లో, మున్నార్‌ లాంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించారు. ‘ద వరల్డ్‌ ఆఫ్‌ కపట’ {THE WORLD OF KAPATA  ON 18 august) కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 18 వరకూ వేచి చూడాల్సిందే! 




Updated Date - 2022-08-13T02:42:53+05:30 IST