T. J. Gnanavel : రెండో సినిమాకోసం షాకింగ్ స్టోరీ ?

Twitter IconWatsapp IconFacebook Icon
T. J. Gnanavel : రెండో సినిమాకోసం షాకింగ్ స్టోరీ ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) నటించిన ‘జైభీమ్’ (Jaibheem) చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు, విమర్శకుల ప్రశంసల్ని సైతం మెండుగా అందుకుంది. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాను మెచ్చుకోని వారే లేరు. సూర్య యాక్టింగ్, డైరెక్టర్ మేకింగ్.. ఈ సినిమాను వేరే లెవెల్లోకి తీసుకెళ్ళింది. అమాయక గిరిజనులపై దొంగకేసులు బనాయించి పోలీసులు సాగించే దురాగతాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel). పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్ళింది. చంద్రు అనే డిఫెన్స్ లాయర్ నిజజీవితంలో జరిగిన అమానుష సంఘటనల్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. 

ఈ సినిమా ఘన విజయంతో బోలెడన్ని ఆఫర్స్‌ను అందుకున్న దర్శకుడు జ్ఞానవేల్.. వాటిని సున్నితంగా తిరస్కరించి.. ఎలాంటి హడావిడి లేకుండా.. సైలెంట్ గా తన రెండో సినిమాను మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే రెండో సినిమా కోసం షాకింగ్ కథాంశాన్ని తెరకెక్కిస్తున్నట్టు వినికిడి. ఈ కథతో ఏకంగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నట్టు టాక్. దీనికి ‘దోశకింగ్’ (Doshaking) అనే టైటిల్ ను ఖాయం చేశాడట. టైటిల్ చూడగానే ఇదేదో కామెడీ చిత్రం అనుకుంటారు. కానీ చాలా సీరియస్ కథాంశమని, దీన్ని థ్రిల్లర్ జోనర్ లో రూపొందించనున్నట్టు కోలీవుడ్ సమాచారం. మొదటి సినిమాలాగానే దీన్ని కూడా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించనుండడం విశేషం.

2001లో జీవన జ్యోతి (Jeevana Jyothi) అనే అమ్మాయి భర్తను హత్యచేసినట్టుగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంది. ఇందులో శరవణ భవన్ (Saravana Bhavan) చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకుడు పి.రాజగోపాల్ (P Rajagopal) హస్తముందట. దీనిపై ఆ అమ్మాయి న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయని, వాటన్నిటినీ ‘దోశకింగ్‌’ లో దర్శకుడు డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయబోతున్నాడని చెబుతున్నారు. ఇంతవరకూ నటీనటులు వివరాలు కానీ, సాంకేతిక నిపుణుల గురించి కానీ ఇంకా తెలియదు. త్వరలోనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, ఆ వివరాలు తెలియచేస్తానని దర్శకుడు తెలిపాడు.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.