Salman Khan vs Shah Rukh Khan: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్.. షారుఖ్ ఖాన్‌ని ట్రోల్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-08-12T19:56:16+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా సొంతంగా..

Salman Khan vs Shah Rukh Khan: ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్.. షారుఖ్ ఖాన్‌ని ట్రోల్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా సొంతంగా స్టార్‌గా అగ్రస్థానానికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో వరుసగా సూపర్ హిట్లు సాధిస్తూ బాలీవుడ్ స్టార్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. అయితే.. కొన్నేళ్లుగా ఈ నటుడి సరైన హిట్ లేదు. ఇతర హీరోల సినిమాల్లో మాత్రం గెస్ట్ పాత్రలో మెరిశాడు. అందులో రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’, ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘టైగర్ 3’ మూవీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఆమీర్ సినిమా ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ షారుఖ్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు.


షారుఖ్ ఖాన్ గెస్ట్‌గా చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని.. అందుకే ‘టైగర్ 3లో షారుఖ్ మాకు వద్దు’ అని సల్మాన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా కొందరైతే.. ‘పీఆర్‌ తయారు చేసిన స్టార్, ఎక్కువగా అభద్రతాభావం ఉన్న వ్యక్తి, ఓవర్ యాక్టింగ్, అబద్ధాలు చేప్పే వ్యక్తి’ అంటూ కొందరూ.. ‘అభిమానుల మధ్య యుద్ధం అనేది ఒక భిన్నమైన విషయం. కానీ మీరు సల్మాన్ ఖాన్‌ ట్రోల్ చేస్తే మేం వదలం. సల్మాన్ అభిమానులుగా షారుఖ్‌ని పాకిస్తాన్ పంపిచేస్తాం’ అంటూ కొందరు కొంచెం ఘాటుగానే షారుఖ్‌ని ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై షారుఖ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా.. షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ అనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.









Updated Date - 2022-08-12T19:56:16+05:30 IST